27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఏం,,
,###

మేం
పువ్వులం కామా 
నీ రచనలకు పనికి రామా 
ఎందుకయ్యా ఇంత వివక్ష 
మాపై ఇంత కక్ష 

ఎప్పుడు 
మల్లెలు మందారాలు 
గులాబీలు సన్నజాజులేనా 

తోటలోని మిగతా పూలన్నీ 
కట్ట కట్టుకొని నన్ను నిలదీశాయి 
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి 

అందుకే కాబోలు 
‘’ఏ పారిజాతమ్ము లీయగలనో సఖి 
గిరి మల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప ‘’
అని మిగతా పూలను ఉటంకించి 
వాటి బారి నుండి తప్పించుకున్నారు సినారే 

ఎప్పుడు లేనిది ఎంత భంగ పడ్డాను 
బ్రతుకు జీవుడా అంటూ బయట పడ్డాను 

మిత్రులారా !
మీరు మాత్రం వెళ్ళకండి పూల జోలికి 

జాగ్రత్త సుమా !!
ఒకవేళ ఎదురైతే పలకరిస్తే వేస్తాయి 
కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి