అక్షర గవాక్షంలో నిలబడి
లోకాన్ని పరికిస్తున్నాను
అక్షరాప్సారో భామినుల
పేరోలగంలో ముచ్చటలాడుతున్నాను
అక్షర తూలికా తల్పం పైన
శయనించి వున్నాను
అక్షరాంగనల నృత్యభంగిమలు
తిలకిస్తున్నాను
అక్షర తూణిరం లోంచి
కవితలు కావ్యాలు
శర పరంపరలుగా సంధిస్తున్నాను
అక్షర క్షీరసాగర
మధనం చేస్తున్నాను
అక్షరాన్ని
రక్షరేకుగా ధరించాను
అక్షర
లక్షలు గడించాను
సుశిక్షితు లైన
అక్షర సైనికుల్ని
నా చుట్టూ కాపలా పెట్టుకున్నాను
నన్ను కాపాడుతున్న
అక్షరానికి అభివాదం చేస్తున్నాను
లోకాన్ని పరికిస్తున్నాను
అక్షరాప్సారో భామినుల
పేరోలగంలో ముచ్చటలాడుతున్నాను
అక్షర తూలికా తల్పం పైన
శయనించి వున్నాను
అక్షరాంగనల నృత్యభంగిమలు
తిలకిస్తున్నాను
అక్షర తూణిరం లోంచి
కవితలు కావ్యాలు
శర పరంపరలుగా సంధిస్తున్నాను
అక్షర క్షీరసాగర
మధనం చేస్తున్నాను
అక్షరాన్ని
రక్షరేకుగా ధరించాను
అక్షర
లక్షలు గడించాను
సుశిక్షితు లైన
అక్షర సైనికుల్ని
నా చుట్టూ కాపలా పెట్టుకున్నాను
నన్ను కాపాడుతున్న
అక్షరానికి అభివాదం చేస్తున్నాను

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి