27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమె పలికిన -ఒక తాదాత్మ్య గీతం -
----------------------------------------

ఎవరోయి... నీవు 
ఎద లోన ఒదిగావు 
మమతాను రాగాలు
మది నిండ పొదిగావు//


చిరు నవ్వుతో ఎదురైనావు 
సిగ పువ్వువు నువ్వన్నావు 
నన్నేలే దొర వైనావు 
నా జీవన రాగమైనావు 
నా సర్వస్వం అయినావు //

మనసంతా నీవేనయ్యా
నా మనుగడ నీవేనయ్యా 
ఎన్ని జన్మలైనా 
నా తోడువు నీవయ్యా 
నా దైవం నివే నయ్యా //

పెదవి పైన కాపురముంటా
పొదువుకొని కలలే కంటా 
బిగి కౌగిలిలో జీవితమంతా 
కరిగి కరిగి పొమ్మంటా //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి