27, అక్టోబర్ 2017, శుక్రవారం

కోయిల --
ఎవరి మెప్పుకోసం 
పాట పాడదు 
ఏ సరిగమల సాయం కోరదు 

ఎవరో వస్తారని ఆలకిస్తారని 
ఎదురు చూడదు 
ఏ ప్రేక్షకులు శ్రోతలు 
తనకు అవసరం లేదు 

తన గీతం 
తన ఆలాపన తన కోసమే 
పాటంతా 
తన్మయమే చిద్విలాసమే 

అర్ధమయింది 
నా కవిత్వము అంతే 
నా ఆనందం కోసమే 
నా ఆరోగ్యం కోసమే 
నా రచనలు 
నాకు ఆనందాన్ని కలిగిస్తాయి 
ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి 

అందుకే 
నా పాట చుట్టూ నేను
నా చుట్టూ నా పాట 

నేను 
నిర్విరామంగా ఆలపిస్తున్న కోయిల పాటని
పుష్ప ఫల భరితమైన పూవుల తోటని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి