27, అక్టోబర్ 2017, శుక్రవారం

ముఖ పుస్తకమా నీకు జోహారు !!
---------------------------------

ఎన్ని పలకరింపులు 
ఎన్ని పన్నీటి చిలకరింపులు 
ఎన్ని ప్రియగానాలు ..
ఎన్ని సుమబాణాలు 
ఎవరో ..ఎవరికీ ఎవరో తెలియని గమ్మత్తులు 
చిత్రాలతో విచిత్రాలు చేసే అక్షరాల గుత్తులు 
ఎన్ని పద చాలనాలు ఎన్ని పరవశ గీతాలు 

తెల్లవారిందో లేదో 
బిలబిల మంటూ బిరబిర మంటూ 
సముహంలా ప్రవాహంలా 
ఆత్మీయంగా గుంపులు గుంపులుగా 
ఇంతలు అంతలు అంటూ 
కేరింతలు కవ్వింతలు 

ఈర్ష్య అసూయలు లేని లోకమిది 
ఎన్నెన్నో హృదయాలను 
ఏకం చేసే మమేక మిది 
ఇక్కడ ఈ మూల కూర్చుని 
ఎక్కడో వున్న 
వేల హృదయాలను తట్టి లేపడం 
వారితో పృచ్చ చేయడం అద్భుతం కదా 

ఎని కోట్లు గడించినా ఏముంది 
ఎంత ఎత్తుల కెదిగినా ఏముంది 
ఈ గుర్తింపు పలకరింపు కోసమే కదా 
ప్రతి వ్యక్తీ తపనలు 
తలకిందులుగా తపస్సులు 

ముఖ పుస్తకమా! 
ఓ ప్రియ నేస్తమా !!

నీ వలన 
ఎంత ఆనందమో ఆరోగ్యమో 
ఏది తోచని వేళలు
ఏవో నక్కల వూళలు 
దరి జేరనియ కుండా 
అశాంతి కీలలలో దగ్ధమై పోకుండా 
కాలాన్ని విరామాన్ని జీవితాన్ని 
పరిమళ భరితం చేస్తున్న 
నీకు జోహారులు --

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి