27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎన్ని కలలు 
వెనుదిరిగి వెళ్లి పోయాయో 
నువ్వు లేవని తెలిసి 

ఎన్ని రాత్రులు 
విరహంతో వేగి పోయాయో
నువ్వు రావని తెలిసి

ఎన్ని ఆశలు
ఎండమావులయ్యాయో
నీకోసం నిట్టూర్పులు విడిచి

ఎంత శాంతి
ఎంత సంతోషం
ఎంత ఆనందం
ఇగిరి పోయిందో

నువ్వు రాని కారణాన
నా జీవన బృందావనిలో
ఎడారులు మొలిచి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి