నా కవిత
ఎన్ని ఉదయాలను
మేలుకొలిపిందో
ఎన్ని కిరణాలను
ఉసి గొలిపిందో
ఎన్ని సుమాలతో
ముచ్చటించిందో
గాలి కెరటాలతో
ఏమని వూసులాడిందో
ఎన్ని హృదయాలను
ఉడికించిందో
ఎంత నిదురను
కాజేసిందో
ఎంత కలతను
రాజేసిందో
ఎన్ని రాగసుధలను
నాపైన కుమ్మరించిందో
ఎంత ఆరోగ్యం
నాకు ప్రసాదించిందో
అందుకే నా కవితకు
ఎంతో రుణపడి ఉన్నాను
ఎన్ని ఉదయాలను
మేలుకొలిపిందో
ఎన్ని కిరణాలను
ఉసి గొలిపిందో
ఎన్ని సుమాలతో
ముచ్చటించిందో
గాలి కెరటాలతో
ఏమని వూసులాడిందో
ఎన్ని హృదయాలను
ఉడికించిందో
ఎంత నిదురను
కాజేసిందో
ఎంత కలతను
రాజేసిందో
ఎన్ని రాగసుధలను
నాపైన కుమ్మరించిందో
ఎంత ఆరోగ్యం
నాకు ప్రసాదించిందో
అందుకే నా కవితకు
ఎంతో రుణపడి ఉన్నాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి