27, అక్టోబర్ 2017, శుక్రవారం

మనసు 
కసురు కొన్నది
అనవసరమైన ఆలోచనలతో
నన్నేల విసిగిస్తావని

హృదయం 
ఉసూరుమన్నది
విపరీతమైన వేదనతో
ఎన్నాళ్ళిలా కొట్టుకు చావాలని

దేహం 
దిగులుగా చూచింది
ఈ ఇద్దరి వాగ్యుద్ధానికి
తన మనుగడ ప్రశ్నార్ధకమని

జీవితం 
సుదీర్ఘంగా నిట్టూర్చింది
ఈ ఘర్షణతో నూరేళ్ళు కొనసాగడం
ఇక దుర్లభమని అసంభవమని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి