ఒక ప్రేమ గీతం
---------------
మనసేమో
మరుమల్లె వంటిది
వయసేమో
హరివిల్లు వంటిది
మరిచి పోకు మనసుని
మరిచి పోకు వయసుని
మరువబోకు ఓ మనసా !
జీవితమే చిరు జల్లు వంటిది
జీవనమే పొదరిల్లు వంటిది //
మనసు మరిచి పోయావా
తెలియలేవు సుగంధాలు
వయసు మరిచి పోయావా
మరలి రావు వసంతాలు
కలలు నిజం చేసుకున్నావా
దిగి వచ్చును దిగంతాలు //
ఒకరికొకరు తెలియదులే
ఒంటరిగా నువ్వుంటే
వలపు పల్లవించదులే
కలలేవీ రాకుంటే
బ్రతుకు పరిమళించదులే
బంధాలే లేకుంటే //
---------------
మనసేమో
మరుమల్లె వంటిది
వయసేమో
హరివిల్లు వంటిది
మరిచి పోకు మనసుని
మరిచి పోకు వయసుని
మరువబోకు ఓ మనసా !
జీవితమే చిరు జల్లు వంటిది
జీవనమే పొదరిల్లు వంటిది //
మనసు మరిచి పోయావా
తెలియలేవు సుగంధాలు
వయసు మరిచి పోయావా
మరలి రావు వసంతాలు
కలలు నిజం చేసుకున్నావా
దిగి వచ్చును దిగంతాలు //
ఒకరికొకరు తెలియదులే
ఒంటరిగా నువ్వుంటే
వలపు పల్లవించదులే
కలలేవీ రాకుంటే
బ్రతుకు పరిమళించదులే
బంధాలే లేకుంటే //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి