27, అక్టోబర్ 2017, శుక్రవారం


ఎవ్వరో 
ఇంత అందం 
ఇక్కడ కుమ్మరించారు 
నా ముందు కుప్పపోసారు 
ఎందుకో మరి 
నన్ను చూస్తుండమని 
కాపలా ఉంచారు 
ఎదురుగా ఉండగా ఇంత పెన్నిధి 
ఎలా ఎలా మిన్నకుండను హతవిధీ 

ఎన్ని మందహాసాలు 
ఎన్ని చిద్విలాసాలు 
ఎన్ని సోయగాలు 
ఎన్ని సుమపరాగాలు 
ఎడనెడ నిండుగా 
అగుపడు చుండగా 
చిడిముడి తలపులతో 
గుండె నిండగా

ఇన్నిన్ని వరాలు 
ఎప్పుడు ఎవ్వరిచ్చారో 
ఆ దివినుండి
ఏ దేవతలు ఆశీర్వదించారో 
అపురూపమైన అందాలన్నీ 
నాకు అంకిత మైనాయి 
ఎనలేని సిరి సంపదలు 
నా సొంతం అయినాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి