27, అక్టోబర్ 2017, శుక్రవారం


నువ్వు 
ఒక అద్భుతానివి 
అపురూపానివి 
అజరామరానివి 
అద్వితీయంగా 
అనితర సాధ్యంగా 
విద్యార్ధులను తీర్చి దిద్దిన 
అధ్యాపకురాలివి 

ఎన్ని హృదయాలు నీ జ్ఞాపకాలను 
పదిల పరచుకున్నాయో 
మహోన్నతంగా ఎదిగిన ఎన్ని మానసాలు 
నీ ఔన్నత్యాని అనునిత్యం మననం చేసుకొంటున్నాయో

నీవు అడుగిడిన ఎన్ని విద్యాలయాలు
అద్భుతమైన నీ మేధకు ప్రతిభకు హారతులిచ్చాయో 

నీ జీవితం కమనీయం రమణీయం 
కొన్ని వేల జీవితాల భవితవ్యాన్ని 
తీరిచి దిద్దిన నీ అభినివేశం చిరస్మరణి యం 

(ఉలవపాడు ప్రభుత్వ పాఠశా లలో ప్రధానోపాధ్యాయినిగా అద్భుతాలు సృష్టించి, అంతర్ధానమైన నా జీవన సహచరి రాజేశ్వరి కి -ఈ గురుపూ జోత్సవం సందర్భంగా- నివాళిగా ........)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి