అయ్యో రామ !!!
================
పొమ్మన లేక పొగ బెట్టావు
అన్యాయంగా నా పొట్ట కొట్టావు
ఆక్రోశం వెలిబుచ్చింది ఒక దోమ --
నా పుట్టలో కాపురం పెట్టావు
నిలదీస్తే కసిగా బుసకొట్టావు
పాముని నిలదీసింది ఒక చీమ --
నా మనసుని కా జేసావు
ఎన్ని ఉన్నా ఏమిలేని దానిని చేసావు
అలుకలు బోయింది ఒక లేమ ---
ఒక స్త్రీని చెరబట్టావు
నా కడుపునా చెడ బుట్టావు
ఘోరంగా శపించింది ఒక అమ్మ --
ఎంతందంగా విరబూ శావు
ఎన్ని అందాలు ఆరబోశావు
పువ్వుని చూచి పులకించింది ఒక కొమ్మ --
ఇవన్ని నగ్న సత్యాలే --
లోకంలో జరిగే నిత్యకృత్యా లే ---
అంటే ఎవరూ వినరేమిటి !
అర్ధం చేసుకోరేమిటి!! అయ్యోరామ !!!
-(--------------సరదాగా కాసేపు -అంతే )
================
పొమ్మన లేక పొగ బెట్టావు
అన్యాయంగా నా పొట్ట కొట్టావు
ఆక్రోశం వెలిబుచ్చింది ఒక దోమ --
నా పుట్టలో కాపురం పెట్టావు
నిలదీస్తే కసిగా బుసకొట్టావు
పాముని నిలదీసింది ఒక చీమ --
నా మనసుని కా జేసావు
ఎన్ని ఉన్నా ఏమిలేని దానిని చేసావు
అలుకలు బోయింది ఒక లేమ ---
ఒక స్త్రీని చెరబట్టావు
నా కడుపునా చెడ బుట్టావు
ఘోరంగా శపించింది ఒక అమ్మ --
ఎంతందంగా విరబూ శావు
ఎన్ని అందాలు ఆరబోశావు
పువ్వుని చూచి పులకించింది ఒక కొమ్మ --
ఇవన్ని నగ్న సత్యాలే --
లోకంలో జరిగే నిత్యకృత్యా లే ---
అంటే ఎవరూ వినరేమిటి !
అర్ధం చేసుకోరేమిటి!! అయ్యోరామ !!!
-(--------------సరదాగా కాసేపు -అంతే )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి