27, అక్టోబర్ 2017, శుక్రవారం

వడ్డి కి గడ్డి తిని -హార్ట్ అటాక్ 
-------------------------------

ఒక మిత్రుడికి 
గుండె పోటు వచ్చింది హటాత్తుగా
పరుగెత్తు కెళ్ళా ను
ఏమిటి ఎప్పుడు ఎలా???
ఈ ప్రశ్నలు అప్పటికే అక్కడ చిందర వందరగా
నిన్నటిదాకా బాగున్నాడు కదా
ఏమయింది పాపం ఏ కష్టాలొచ్చి పడ్డాయి

ఫలానా వ్యక్తీ నిన్న మరణించాడు
అయితే ఇతడి కేమయిందిట
అతనికి ఇతడు .లక్షలు వడ్డీకి ఇచ్చాడు
అలాగా అయితే ..............
వాడి వారసులు దిక్కున్న చోట చెప్పుకో అన్నారు
ఆ మృతుడికి ఆస్తులు లేవు
అప్పులు ఆర్భాటాలు తప్ప
అంతే! వీడి గుండె ఠావులు దప్పింది
డాక్టరు దగ్గర కెళితే లక్షలు ఖర్చు అన్నాడు
మళ్ళి అటాక్ ఇంకో సారి
అంతే వీడికి భూమి మీద నూకలు చెల్లి పోయాయి

వడ్డీకి గడ్డి తిన్నాడు
ఉన్నదంతా వడ్డి కి ఇచ్చి
వారిచ్చే ఆ ముష్టి తొ
ఇన్నాళ్ళు జీవనం సాగించాడు
ఏమీ లేని వాడిలా
దిగులుగా దీనంగా దరిద్రంగా బతికాడు
అసలు, వడ్డీ అన్ని గల్లంతయ్యాయి
ఇప్పుడు ప్రాణాలే ....................

‘ఆశా పాశము దాగడున్నిడుపు’
అత్యాశ మృత్యువుని లాక్కొచ్చి
వీడి ముంగిట్లో పడేసింది
ఏనాడు వీడు నిర్భయంగా జీవించలేదు
ఎవరిపైనా దయ కరుణ కురిపించ లేదు
పిల్లి కి బిచ్చం పెట్ట లేదు
తాను సైతం మంచి బట్ట కట్ట లేదు
వచ్చిన వారంతా ఈసడించుకొనే వారే
తగిన శాస్తి జరిగిందని
బాహాటంగా చెప్పుకునే వారే
ఇన్నాళ్ళు గడ్డి తిని సంపాదించాడు

అరరే ....అదేమిటి
పాడె పైన అలా ఎండు గడ్డి పరుస్తారేమిటి
నోట్ల కట్టలు పరవండి
కట్టెలతో కాలుస్తారేమిటి
ఆస్తి గుట్టలుగా పడి ఉన్నది కదా
మొత్తం శవం పైన వేసి తగలెట్టండి

అతడి ఆత్మ ఆ చెట్టుపైన చేరి
ఘోషిస్తున్నది అక్రోశిస్తున్నది
అయ్యో తన సిరి సంపద ఏం కావాలని
గట్టిగా గుండెలు బాదు కొంటున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి