అడ్డంగా దోచుకొంటున్నాయి చదువులు చెప్పే బళ్ళు
ఆకాశంలో ఎక్కడో ఉన్నాయి వాళ్ళ కాళ్ళు కళ్ళు
ఇంత అన్యాయం అధర్మం దోపిడీ జరుగుతూ ఉన్నా
అరె! ఇదేమి న్యాయమని నిలదీయరే ఒకళ్ళు
అక్కడ చదువు సంధ్య లేదు చట్టుబండలు లేవు
అవి మండుతున్న నెగళ్లు ప్రత్యక్ష నరకానికి నకళ్ళు
ఈ వానాకాలం చదువుల పుణ్యమా అని
పిజ్జాలు బర్గర్లుగా మారి పోయాయి చిరుతిళ్ళు
నిశితంగా తేరిపార చూడగా ఇక్కడే కనిపిస్తాయి
రేపటి తరానికి భవితవ్యానికి పగుళ్ళు
ఇంత ఘోరకలి ఎదురుగా జరుగుతున్నా
ఎవరు పట్టించుకోరేం ఎంతకాలం ఈ దిగుళ్ళు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి