భాష
---------
చదువు రాని రైతు
అమాకంగా అడిగాడు
మన భాషలో న్యాయం లేదా
ఇంకో భాషలోనే ఉందా
---------
చదువు రాని రైతు
అమాకంగా అడిగాడు
మన భాషలో న్యాయం లేదా
ఇంకో భాషలోనే ఉందా
న్యాయస్థానం లో
ప్రతి ఒక్కడు మొహం వేలాడేసాడు
అతని బాధని
ఎలా తర్జుమా చెయ్యాలా తెలియక
ఆ వాదనని
ఏ భాషలో నమోదు చేసుకోవాలో అర్ధం కాక
ప్రతి ఒక్కడు మొహం వేలాడేసాడు
అతని బాధని
ఎలా తర్జుమా చెయ్యాలా తెలియక
ఆ వాదనని
ఏ భాషలో నమోదు చేసుకోవాలో అర్ధం కాక
దిక్కు మాలిన భాషలో
మాట్లాడుకుంటారు
మదించిన పోట్టేళ్ళలా
పోట్లాడుకుంటారు
మాట్లాడుకుంటారు
మదించిన పోట్టేళ్ళలా
పోట్లాడుకుంటారు
ఏంవాదిస్తున్నారో
ఒక్క ముక్క తెలిసి చావదు
కోర్టుల్లో తెలుగన్నది
ఎక్కడా వినబడదు
ఒక్క ముక్క తెలిసి చావదు
కోర్టుల్లో తెలుగన్నది
ఎక్కడా వినబడదు
తెలుగులో ఆలోచిస్తాం
తెలుగులోనే కలలు కంటాం
ఎందుకో మరి అంత తెగులు
తెలుగంటే ఏవగించుకుంటాం
తెలుగులోనే కలలు కంటాం
ఎందుకో మరి అంత తెగులు
తెలుగంటే ఏవగించుకుంటాం
మాతృభాష విస్మరిస్తే
మనిషి గా పనికి రాడు
మన సంస్కృతి మరిచి పొతే
సంతోషంగా మన లేడు
అమ్మను నిర్లక్ష్యం చేస్తే
అదీ ఒక బ్రతుకేనా
అంత నికృష్టుడు
ఇలలో ఒక్కడేనేమో
ఈ తెలుగువాడు
మనిషి గా పనికి రాడు
మన సంస్కృతి మరిచి పొతే
సంతోషంగా మన లేడు
అమ్మను నిర్లక్ష్యం చేస్తే
అదీ ఒక బ్రతుకేనా
అంత నికృష్టుడు
ఇలలో ఒక్కడేనేమో
ఈ తెలుగువాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి