26, అక్టోబర్ 2017, గురువారం

ఆమె నవ్వుతూ అడిగింది
నేను బాగున్నానా
చెవిలో మెల్లగా చెప్పింది
నచ్చితే కాదన్నానా
మనసుతో మంతనాలాడింది
అందులో నేనున్నానా
వయసుతో గుసగుస లాడింది
ఎప్పుడైనా వద్దన్నానా
మల్లెపువ్వు సిగలో అలిగింది
ఇదేమైన మరియాదేనా
సిరి వెన్నెల వేడెక్కి డీడిక్కంది
ఎందుకింత విరహ వేదనా
నడిరేయి పడి పడి నవ్వింది
ఇదేమి కాలయాపనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి