27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎన్ని మెలికలు తిరిగావో 
ఎన్ని మలుపులు చూసావో 
ఎన్ని అలకలు పోయావో ఎంత కలతను మోశావో 
నడుమున రేగిన అలజడిలో ఎన్ని యిడుములు పడినావో 
నడకలు నడిచిన వడివడి లో ఎంతగా తడబడి పోయావో 
ఎన్ని హొయలు ఎన్ని లయలు ఎన్ని హాయి వెల్లువలు

ఎక్కడ మొదలిడి నావో ఎంత చిడిముడి పడినావో
ఇంద్ర ధనసువై ఒకసారి పరువాల సరస్సువై ఒకసారి
పచ్చని పాదాల ముద్దాడి వడివడిగా వరవడిగా సాగిపోయిన నీ ప్రస్తానం
గిరుల శిఖరాగ్రాలు జఘన సందేశాలు గగనసంకేతాలు విమల సంగీతాలు
దారి పొడుగునా మధుర లాస్యాలు రస రమ్య కేళి విలాసాలు

ఎన్ని అందాలు ఎన్ని బంధాలు ఎన్ని సుమసుగందాల సమ్మేళనాలు
ఔరా నీ జీవితం ఎంత సమున్నతం ఎంచి చూడగా నీ జాతకం మహోన్నతం

------నా చీర గురించి ఒక కవిత వ్రాయవా అని ఆమె అడిగిన వెంటనే .....
Image may contain: one or more people and people standing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి