వసంత గానం
----------------
పూల పెదాలు
చుంబించి
మధుపాలు
గంధర్వగానాలు ఆలపిస్తున్న వేళ
----------------
పూల పెదాలు
చుంబించి
మధుపాలు
గంధర్వగానాలు ఆలపిస్తున్న వేళ
పిల్లగాలులు
మల్లెమొగ్గల
బుగ్గలు నిమిరి
మయూర నృత్యాలు చేస్తున్న వేళ
మల్లెమొగ్గల
బుగ్గలు నిమిరి
మయూర నృత్యాలు చేస్తున్న వేళ
వెన్నెల కిరణాల
చరణ మంజీరాల
ఘలంఘలలకు
తోట తనువు పులకిస్తున్న వేళ
చరణ మంజీరాల
ఘలంఘలలకు
తోట తనువు పులకిస్తున్న వేళ
వనకన్యల
కనుసన్నల
చిందించిన మందహాసం
కనుసన్నల
చిందించిన మందహాసం
అల్లనల్లన
అడుగేస్తూ
ఆగమిస్తున్న మధుమాసం
అడుగేస్తూ
ఆగమిస్తున్న మధుమాసం
చోద్యంగా
చూస్తున్నది ఆకాశం
చూస్తున్నది ఆకాశం
అందాల ఆ వని
ఆమని యైన ఆ సన్నివేశం
ఆమని యైన ఆ సన్నివేశం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి