27, అక్టోబర్ 2017, శుక్రవారం

నిన్ను నువ్వు దాటి
ఏపుగా ఎదగలేక పోవడం
వలననే ఈ నీలి నీడలు
ఎప్పుడు 
ఉన్న చోటనే ఉండిపోతే
ఎక్కడ వేసిన గొంగళి లా
అక్కడే పడి ఉంటె
ఎలా కనిపిస్తాయి నింగి జాడలు
‘పాపం పుణ్యం
ప్రపంచ మార్గం’ తెలుసుకొంటేనే
ఆ మహాకవిని కలుసుకొంటేనే
అవగతమౌతుంది
జగన్నాధ రధచక్రాలంటే ఏమిటో
అద్భుతంగా ఎదగడమంటే ఏమిటో
నీ నీడనే నువ్వు చతికిల బడితే ఏం ప్రయోజనం
ఎప్పుడు ఎలా ఎలా చేరుకుంటావు శతయోజనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి