27, అక్టోబర్ 2017, శుక్రవారం


పెరటిలో ఒక చెట్టునైనా పెంచుకోవాలని ఎవరికీ అనిపించదు 
ప్రాంగణంలోనే కాదు జీవితాలలోను పచ్చదనం కనిపించదు 

ప్రేమ అనురాగం మరచి తడారి పోయిన హృదయాలను 
అరుదెంచిన నవవసంతం హరితవనం మురిపించదు 

ఆర్ద్రత ఇగిరిపోయిన ఈ మనిషితో ఏమి పని ఉందని 
నీలాకాశంలో నడిచిపోతున్న ఏ మేఘమూ వర్షించదు 

అమానవీయ చర్యలతో ప్రతి ఒకడు చెలరేగి పోతున్నా 
ఇదేమని ఏ మంచి హృదయము నిలదీయదు గర్హించదు 

ఎండ చండ ప్రచండంగా అవనిని మండిస్తున్నా కృష్ణా !
ఈ మర మనిషి గుండెలో ఏ మంచి ఆలోచన వికసించదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి