ఆకాశాన్ని
అటునిటు కలుపుతూ
ఆ వంతెన ఏమిటనుకున్నారు
అటునిటు కలుపుతూ
ఆ వంతెన ఏమిటనుకున్నారు
ఆ దిక్కుని
ఈ దిక్కుని
అనుసంధించిన
అందాల వారధి
ఆ రధ సారధి ఎవరనుకున్నారు
ఈ దిక్కుని
అనుసంధించిన
అందాల వారధి
ఆ రధ సారధి ఎవరనుకున్నారు
ఆ హృదయంగమ
సంగమభంగిమ
ఎలా వచ్చిన దనుకొన్నారు
......... ... ......
ఓ కాంతి కిరణం
ఓపలేని తాపంతో
ఒక హిమబిందువు
కెమ్మోవిని
సమ్మోహనంగా చుంబిస్తే ....
సంగమభంగిమ
ఎలా వచ్చిన దనుకొన్నారు
......... ... ......
ఓ కాంతి కిరణం
ఓపలేని తాపంతో
ఒక హిమబిందువు
కెమ్మోవిని
సమ్మోహనంగా చుంబిస్తే ....
ఆ రమణీయ దృశ్యం
ఆ నింగి నీలాలలో
రచించిన
రంగవల్లుల మృదు లాస్యం
కనులారా కాంచిన ఆకాశం
ఆ నింగి నీలాలలో
రచించిన
రంగవల్లుల మృదు లాస్యం
కనులారా కాంచిన ఆకాశం
అరసిగ్గుతో
మోమును దాచుకొన్న
అందాల పయ్యెద జిలిబిలి సోయగం
మోమును దాచుకొన్న
అందాల పయ్యెద జిలిబిలి సోయగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి