ఎవరిచ్చారో
ఇన్ని వరాలు ఈ చీరకి
దోర దోర అందాలు
అల్లుకున్న దొరసానికి
ఇన్ని వరాలు ఈ చీరకి
దోర దోర అందాలు
అల్లుకున్న దొరసానికి
ఎలా వచ్చెనో
ఇన్ని సోయగాలు ఈ పైటకి
విభిన్న విన్యాసాలు
నేర్చుకొన్న నాట్య మయూరికి
ఇన్ని సోయగాలు ఈ పైటకి
విభిన్న విన్యాసాలు
నేర్చుకొన్న నాట్య మయూరికి
ఏనాటి పుణ్యమో
ఈ పచ్చల మణి హారానికి
సొంపైన ఎదపైన
వయ్యారంగా సయ్యాట లాడడానికి
ఈ పచ్చల మణి హారానికి
సొంపైన ఎదపైన
వయ్యారంగా సయ్యాట లాడడానికి
ఎదురైన పెదవికి
ఎర్రని వరమివ్వడానికి
ఎంత సంబరమో ఈ బింబాధరానికి
ఎర్రని వరమివ్వడానికి
ఎంత సంబరమో ఈ బింబాధరానికి
ఎదపైన వాలి
నాలో సగమవ్వడానికి
ఎంత ఆరాటమో ఆలింగనానికి
నాలో సగమవ్వడానికి
ఎంత ఆరాటమో ఆలింగనానికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి