27, అక్టోబర్ 2017, శుక్రవారం


సినిమా పాట 
నేడు నగ్నంగా నర్తిస్తోంది 
దుస్తులు విడిచి 
దిగంబరంగా కనిపిస్తోంది 

అర్ధం పర్ధం లేని 
కొన్ని మాటలు మొలకు చుట్టుకొని 
అనాగరికంగా అసహ్యంగా నిస్సిగ్గుగా కులుకుతోంది 

ఆ బూతు పదాలు 
ఇంకా అశ్లీలంగా పాడుతున్నారు గాయనీ గాయకులు
అవి పెదాలపై చప్పరిస్తూ తప్ప తాగినట్లు 
తెగ వూగుతున్నారు నాయికా నాయకులు

కనిపించదు 
అలనాటి హావభావ నటనా కౌసల్యం 
వినిపించదు 
వీనుల విందు చేసే గాన మాధుర్యం

పిచ్చి పట్టినట్టు కుప్పిగంతులు 
పిల్లిమొగ్గలు వేసే వాళ్ళా ప్రేమికులు 
పాటలనిండా పచ్చి బూతులు కారుకూతలు 
పలకడానికి మనస్కరించని పాడు రాతలు 

వింటేనే చాలు 
జుగుప్స వికారం అసహ్యం విహ్వలం 
డబ్బు కోసం దేనికైనా తెగబడుతున్నారు 
ఘనత వహించిన మన నిర్మాతలు 

ఈ డ్రిల్లు ఇంకెన్నాళ్ళు 
హాయిగా సోయగాలు నయగారా లొలికిస్తూ 
అద్భుతమైన నటనలో మెప్పిస్తూ 
నాయికానాయకులు మనకు కనిపించేదేప్పుడు 
గత కాల వైభవం ప్రాభవం తిరిగి వచ్చే దెప్పుడు 
Image may contain: one or more people, people dancing and people on stage
-------కొందరైనా మంచి గేయ రచయితలున్నారు -వారికీ జేజేలు పలుకుతూ -

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి