27, అక్టోబర్ 2017, శుక్రవారం



అందమే శ్రీగంధమై.....
--------------------- 
ఆ కనుబొమలు 
కలిసిన చోట ఒక సూర్యోదయం
ఆ కంటి రెప్పలు 
వాలిన చోట ఒక స్వప్నమందిరం
అ పెదవులు
విచ్చుకున్నచోట ఒక అమృత భాండం
ఆ మధువులు 
దాచుకున్న చోట ఆనంద తాండవం
ఆ నడకలు 
నాట్యమైన చోట ఒక శూన్య నందనం
ఆ అడుగులు 
తడబడిన చోట మదమరాళ నర్తనం
ఎదురు చూస్తున్నది
మనసు మందిరం 
మమతలు 
చిగురించిన మల్లెల ప్రాంగణం
కదలి పోతున్నది 
వెన్నెల జలపాతం 
కమనీయంగా పాడుకొంటూ 
ఒక మధుగీతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి