27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆశ
-----
నగరిలో
ఆ మూల 
సౌధమ్ములో
తర తరాలుగా
మూలుగుతున్న
ధన రాసులు
తమదాకా నడచి రావాలని
చుట్టూ గుడిసెలు కోరుకొంటుంటే
గగనాంగ
నాలింగ నోత్సాహియై
ఆ సౌధం కలగంటున్నది
ఆ గుడిసెలు
నేలమట్టం చేసి
అక్కడ
ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి