27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఈ వారం ఒక గీతం--౩ 

ఒక్క నవ్వు చాలమ్మా 
ఒక్క నువ్వు చాలమ్మా 
ఒక్కటై పోదామమ్మా 
చుక్కల లోకం చూద్దామమ్మా //

వేయి కనులు చాలవమ్మా
రేయి పగలు కలలమ్మా
ఇంతలేసి కన్నులవి
అంత సేపు మూయకమ్మా
కాంతులీను వెన్నెలలు
కటిక చీకటి చేయకమ్మా //

ఒయీ అని పిలువమ్మా
ఓంకారం అది నాకమ్మా
ఓర్వలేని లోకమమ్మా
ఒంటరి పయనం ఏలమ్మా
ఒద్దికగా యిద్దర మొకటైతే
అది ముద్దు ముచ్చట ఔనమ్మా //

పట్టు చీర కట్టవమ్మ
పట్టపు రాణివి నీవమ్మా
బెట్టు చేయ రాదమ్మ
ఒట్టు వేయ వద్దమ్మా
పల్లకిలోన ఊరేగి
నా ఉల్లంలో చేరవమ్మా//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి