27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమె నవ్వింది 
మళ్ళి నవ్వింది 
ఇంకా నవ్వుతూనే ఉంది 
ఆ నవ్వు అద్భుతమైన కవిత్వం లా ఉంది 
అజరామరమైన కావ్యంలా ఉంది 

నాలో ఒక సందేహం సంశయం 
ఇంత మంచి కవిత్వం నేను రాయగలనా 
అంత గొప్పగా అసలెవరైనా సరే రాయగలరా

ఆమె పడిపడి నవ్వుతూనే ఉంది ఇంకా 
పరువం ఒక ప్రవాహం లా కనిపిస్తోంది
సోయగం ఒక సరస్సులా అనిపిస్తోంది 
లాలిత్యం లావణ్యం తారుణ్యం 
ఇనుమడించేలా ఆమె ఇంకా నవ్వుతూనే వుంది 

ఎన్ని కావ్యాలు రాశానో 
చిత్రం ఏ ఒక్కటి ఆ నవ్వుకు సాటి రావు 
ఎన్ని గీతాలు రాశానో 
ఏ ఒక్క గీతం ఆమె అందం ముందు పనికి రాదు 

ఆ నవ్వులన్ని 
తీరిగ్గా ఏరుకొని ఒక్కచోట పేర్చాను
అది అపురూపమైన కావ్యమయింది 
అదే నా జీవన కావ్యం
Image may contain: 1 person, smiling

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి