27, అక్టోబర్ 2017, శుక్రవారం


మనసా ఎందుకే 
అతిగా మధనపడేవు 
ఏవో మౌనగీతాలు ఎలుగెత్తి పాడేవు 

హృదయమా ఎందుకే 
అంత కలత నీకు 
ప్రతి రోజు ఎంతో విలువైనది చేజారి పోనీకు 

జీవితమా ఎందుకే 
ఎండమావులు వలచేవు 
కోరికలను కన్నీటి చారికలను 
రా రమ్మని పిలిచేవు 

కాలమా ఎందుకే 
చండ్రనిప్పులు చెరిగేవు 
కల్లోలాన్ని నాపైకి ఉసి గొలిపేవు
Image may contain: 1 person

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి