27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎందుకు 
ఈ పూలు పున్నమలు
వెన్నెలలు కావ్యాలు స్నేహితాలు 
దేనికైనా పనికి వస్తాయా 

ఒకరోజు నా మిత్రుడు
ఈ స డిం చు కున్నాడు

నేనన్నాను –
ఇవన్ని నావెంట నడుస్తాయి
నా జీవితానికి పరిమళాలు అద్దుతాయి Image may contain: flower, plant, nature and outdoor

కాని నీ సిరులు సంపదలు
నిన్ను చూచి నవ్వుకొంటున్నాయి
నువ్వు మాయం కాగానే అవి కూడా
రెక్కలు విప్పుకొని రివ్వుమంటాయి

నేను ఉన్నా లేకున్నా
నా కావ్యాలు మాత్రం
ఎప్పుడు గుప్పు మంటూనే ఉంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి