27, అక్టోబర్ 2017, శుక్రవారం

పూలకారు నాలో ఉన్నది , 
పాలవెన్నెల లోన కురుస్తున్నది 
పరిమళాలలో తడుస్తూ వెన్నెలలో నడుస్తూ 
ఉక్కిరిబిక్కిరై ఉబ్బితబ్బిబ్బైన నా వయసు 
పరువం పూచిన చోటనే ఆగి ఉన్నది 

పూలబాలలు నన్ను చుట్టుముట్టి 
ఒక పాట కట్టవా అని అడిగాయి 
అది విన్న పైరగాలులు వెన్ను తట్టి 
ఆహా ఏమి నీ అదృష్టం అని పోగిడాయి 

పయ్యెద రెపరెపలు వింటూ 
పరిమళాల దారుల వెంట నడిచి పోతున్నాను 
సోయగాల సరాగాలలో 
అద్భుత సౌందర్య వాహినిలో 
ముద్దగా తడిసి పోతున్నాను 

నడక ఆపి అప్పుడప్పుడు 
నన్ను చూచి నవ్వుతుంది 
తన అందానికి అచ్చెరువున 
మైమరచిన నా తాదాత్మ్యం ఆమెకు నచ్చుతుంది 
ఇంత పిచ్చి వెర్రి పనికిరాదు సుమా
అంటూ అల్లిబిల్లిగా అల్లుకొని అల్లరిగా నా బుగ్గ గిల్లుతుంది
Image may contain: one or more people

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి