ఆరాధన
---------------
ఇంత సౌందర్యం
నా చెంత ఉంటె
అంతకన్నా గొప్ప ఐశ్వర్యం ఏముంది
ఇంత అందం
నా ముందు నిలుచుంటే
ఇంత కన్నా సిరి సంపద ఎక్కడుంది
ఇంత చల్లని నయనం
నన్ను అనునయిస్తుంటే
ఇంతకన్నా నిధి నిక్షేపం ఇంకెక్కడుంది
ఇంత వెన్నెల సొగసు
నన్నంటుకొని ఉంటె
ఇంతకన్నాసౌభాగ్యం మరెవ్వరి కుంది
ఇంత చిలిపి వదనం
ఎదురుగా కవిస్తుంటే
ఇంత కన్నా కలిమి ఇంకెవ్వరి కుంది
ఇంత ఎర్రని పెదవి
నన్ను ఉడికిస్తుంటే
జీవితానికి ఇంక కావల్సిందేముంది
వలచిన చెలి
ఎదురుగా ఉండగా
ఏ భోగభాగ్యాలు ఇంకెందుకు
ఆధర సుధలు
నన్ను లాలించగా
అర్ధంలేని ఏ ఆస్తి పాస్తు లెందుకు
ఇంత వెచ్చని కౌగిలి
నన్ను మురిపిస్తుండగా
ఏ సుందర మందిరాలెందుకు
ఏ భువన భవనాలెందుకు
ఇంత లావణ్యం
నన్ను అలరిస్తుండగా
ఏ గుడిగోపురాలేందుకు
ఏ మడి మాన్యా లెందుకు
---------------
ఇంత సౌందర్యం
నా చెంత ఉంటె
అంతకన్నా గొప్ప ఐశ్వర్యం ఏముంది
ఇంత అందం
నా ముందు నిలుచుంటే
ఇంత కన్నా సిరి సంపద ఎక్కడుంది
ఇంత చల్లని నయనం
నన్ను అనునయిస్తుంటే
ఇంతకన్నా నిధి నిక్షేపం ఇంకెక్కడుంది
ఇంత వెన్నెల సొగసు
నన్నంటుకొని ఉంటె
ఇంతకన్నాసౌభాగ్యం మరెవ్వరి కుంది
ఇంత చిలిపి వదనం
ఎదురుగా కవిస్తుంటే
ఇంత కన్నా కలిమి ఇంకెవ్వరి కుంది
ఇంత ఎర్రని పెదవి
నన్ను ఉడికిస్తుంటే
జీవితానికి ఇంక కావల్సిందేముంది
వలచిన చెలి
ఎదురుగా ఉండగా
ఏ భోగభాగ్యాలు ఇంకెందుకు
ఆధర సుధలు
నన్ను లాలించగా
అర్ధంలేని ఏ ఆస్తి పాస్తు లెందుకు
ఇంత వెచ్చని కౌగిలి
నన్ను మురిపిస్తుండగా
ఏ సుందర మందిరాలెందుకు
ఏ భువన భవనాలెందుకు
ఇంత లావణ్యం
నన్ను అలరిస్తుండగా
ఏ గుడిగోపురాలేందుకు
ఏ మడి మాన్యా లెందుకు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి