30, అక్టోబర్ 2017, సోమవారం

నిద్ర లేవగానే నిలువెత్తు ప్రశ్న?ఈ రోజు ఎలా గడవాలి
నిర్మలంగా నిజాయితీగా నిర్భయంగా ఎలా నడవాలి
ఇలపైకి వచ్చిన కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్న
ఈ మనిషిని ఇంత గందరగోళ మెందుకని అడగాలి
హాయిగా తీయగా అద్భుతంగా జీవితాన్ని గడపక
ఎందుకో మరి ప్రతి మనిషిలో భరించలేని వడగాలి
స్వార్ధం వంచన మోసం దుర్మార్గం దౌర్జన్యం ఇన్ని
దారుణాలతో కలుషితమైన మనసుల నెలా కడగాలి
అడుగడుగునా పేరుకు పోయిన ఈ చెత్త చెదారాన్ని
ఆమూలాగ్రం ఎప్పుడు ఎవరు దుమ్ము దులపాలి
అందరిలో ఎంత మేధ ఉన్నా ఏమ్మున్నది కృష్ణా
నిద్రాణమైన ఈ జాతిని ఎవరు ఎలా మేలుకొలపాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి