ఇంకేమి వ్రాయను !
ప్రణయ సౌందర్య హర్మ్య
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప
ప్రణయ సౌందర్య హర్మ్య
ప్రాకార కుడ్య రస వర్ణనలు తప్ప
ఇంకేమి పాడను !
సుందర సుమధుర మనోజ్ఞ ప్రణయ
సుమ గీతికలు తప్ప
సుందర సుమధుర మనోజ్ఞ ప్రణయ
సుమ గీతికలు తప్ప
కనుపింపదు ఇంకేది !
సౌందర్య గిరి సానువుల చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ సంచయము తప్ప
సౌందర్య గిరి సానువుల చెంగు చెంగున ఉరుకు
సెలయేటి తరంగ కురంగ సంచయము తప్ప
వినిపింపదు ఇంకేది !
శృంగార సాలభంజికల పద మంజీర
మంజుల సంగీత విభావరి తప్ప
శృంగార సాలభంజికల పద మంజీర
మంజుల సంగీత విభావరి తప్ప
నా భావం .........
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న ఎలకోయిల
మధుమాస సమాగమ వేళ
ఎలుగెత్తి పాడుతున్న ఎలకోయిల
నా ధ్యానం .....
ఆ పాట ప్రతి చరణమ్ములో పొదిగిన
ప్రణయాక్షరాల ప్రసూన మాల
ఆ పాట ప్రతి చరణమ్ములో పొదిగిన
ప్రణయాక్షరాల ప్రసూన మాల
డా సినారే ఆవిష్కరించిన నా మొదటి కావ్యం ‘’పుప్పొడి రాలిన చప్పుడు’’ (1999)లోని చివరి కవిత –వారిని సంస్మరించు కొంటూ, వారికి నివాళి అర్పిస్తూ ----------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి